పేరెంట్స్ ఓటేస్తే పిల్లలకు ‘పది మార్కులు’!

పేరెంట్స్ ఓటేస్తే పిల్లలకు ‘పది మార్కులు’!

మమ్మల్ని గెలిపిస్తే అది చేస్తాం ..ఇది ఇస్తాం.. అంటూ జనాలకు వరాలిస్తుంటాయి పార్టీలు. అమలు సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెడుతుంటాయి. ఓ స్కూలు కూడా అలాంటి వరమే ఇచ్చింది. అయితే, ఓటర్లకు కాదు. స్టూడెంట్స్ కు. ‘‘తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కు లు ఎక్కువ కలుపుతాం” ఇదే ఆ హామీ. అబ్బ భలే బాగుంది ఆఫర్​..పాసైపోవచ్చు అని అనుకుంటున్నారా స్టూడెంట్స్ . కానీ, మీకు ఆ అదృష్టం లేదు. ఎందుకంటే ఈ ఆఫర్​ ఇచ్చింది ఉత్తర్​ప్రదేశ్​లో కాబట్టి. లక్నోలోని క్రైస్ట్​ చర్చి కాలేజ్​ ఈ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. తల్లిదండ్రులతో ఓటేయిస్తే ఫైనల్ రిజల్ట్స్​లో పది మార్కులు కలుపుతామని ఆ స్కూలు ప్రిన్సి పాల్ ఆర్కే ఛత్రీ చెప్పారు. చెప్పడమే కాదు..గేటుకు పెద్ద బ్యానర్​నూ కట్టేసిం ది స్కూలు యాజమాన్యం.

‘‘సొంత, దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని చెప్పేందుకు ఆయుధమే ఓటు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా విన్నపం. ఏంటంటే.. అందరూ ఓటేయండి. ఓటు వేసిన వారి పిల్లలకు ఫైనల్ రిజల్ట్స్​లో పది మార్కు లు అదనంగా కలుపుతాం” అని ఆ బ్యానర్​లో ఉంది. ఇప్పటికే దేశంలోని కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.