దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయాలని భావించారు.
కానీ పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పడుతుందని, డబ్బింగ్ సహా అన్ని టెక్నికల్ విషయాల్లో కూడా రాజీ పడకుండా పని చేస్తున్నట్లు, అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇందులో దుల్కర్ ఎనభైల నాటి మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్‌గా కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
