మళ్లీ పెరుగుతోన్న లంపి వైరస్ కేసులు .. లక్షణాలివే

మళ్లీ పెరుగుతోన్న లంపి వైరస్ కేసులు ..  లక్షణాలివే

మరోసారి లంపి వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఈ వైరస్  ప్రభావం ఎక్కువగా ఉంది.  ఈ వ్యాధి సోకి అనేక ఆవులు, ఎద్దులు చనిపోతున్నాయి.  లంపి వైరస్ అనేది  ఒక వైరల్ చర్మ వ్యాధి.  ఇది ప్రధానంగా పశువులను ప్రభావితం చేస్తుంది. ఈగలు, కొన్ని రకాల దోమలు పేలు వంటి రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది జంతువులలో జ్వరం, చర్మంపై గడ్డలై మరణానికి కూడా దారితీస్తుంది.

లంపీస్కిన్ లక్షణాలివే..

ఆవులకు, ఎద్దులకు చర్మమంతా పొలుసులుగా మారుతుంది. చర్మంపై  గడ్డలు వచ్చి పగిలి ఎర్రగా మారతాయి. కంటి నుంచి నీరు కారడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులతో పశువులు జ్వరం బారిన పడతాయి. ఆవుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. సూడి ఆవులు ఇడ్చుకుపోతాయి. దీంతో పశువులు మేత మేయకుండా  అనారోగ్యం పాలవుతాయి 

నివారణ చర్యలు ఇలా...

వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వ్యాధి సోకిన పశువులను మిగతా వాటితో కలవనివ్వద్దు. పశువుల కొట్టంలో దోమలు, ఈగలు, గోమార్లు రాకుండా దోమ తెరలు ఏర్పాటు చేయాలి. వ్యాధి సోకిన పశువులకు రాగిజావ, నూకల జావ, పచ్చిగడ్డి, విటమిన్లు అందించాలి.