పుణె టు హైదరబాద్ ఫ్లైట్ లో వచ్చిన లంగ్స్

పుణె టు హైదరబాద్ ఫ్లైట్ లో వచ్చిన లంగ్స్

హైదరాబాద్‌‌, వెలుగు: లంగ్స్‌‌ పాడైన ఓ వ్యక్తిని చెన్నై, హైదరాబాద్‌ అధికారులు, జీవన్‌ దాన్ ఫౌండేషన్‌ ప్రతినిధుల చొరవతో కిమ్స్‌‌ డాక్టర్లు బతికించారు. పుణెలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన ఊపిరితిత్తులు గంటలోనే హైదరాబాద్‌ లోని కిమ్స్‌‌ హాస్పి టల్‌ కు చేరగా డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్‌ ను పూర్తి చేశారు. తొలుత కరోనా టెస్టు చేసి నెగెటివ్ తేలాక లంగ్స్‌‌ సేకరించారు. వాటిని పుణె నుంచి చార్టెడ్ విమానంలో కిమ్స్‌‌కు ఆదివారం తరలించారు. ఇందుకోసం
పుణే, హైదరాబాద్‌ లో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అప్పటికే పేషెంట్‌ ను సిద్ధం గా ఉంచిన డాక్టర్లు సక్సెస్‌ ఫుల్‌ గా ట్రాన్స్‌‌ ప్లాంటేషన్ పూర్తి చేశారు. తెలంగాణ జీవన్ దాన్ ఫౌండేషన్ ఇన్‌ చార్జి డాక్టర్ స్వర్ణలత, పుణెలోని జడ్‌‌టీసీసీ సంస్థ సెంట్రల్ కో ఆర్డినే టర్ ఆర్తీ గోఖలే, పోలీసులు, ఎయిర్‌ పోర్ట్ అథారిటీ అధికారుల కృషితోనే ఇది సాధ్యమైందని కిమ్స్‌‌ హాస్పిటల్ వెల్లడించింది.