
హీరోల పుట్టినరోజులకి వాళ్ల సినిమాల అప్‌డేట్స్ రిలీజ్ కావడం కామన్. ఈ నెల 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ‘లైగర్’ మూవీ టీమ్ కూడా ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తుందని ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులు వేస్ట్ కాలేదు. మే 9న నాలుగింటికి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు మేకర్స్ నిన్న ప్రకటించారు. ‘అతను ఆకలిగా ఉన్నాడు. ఇండియా కూడా ఆకలిగా ఉంది. ఇక అతన్ని చూపించే సమయం వచ్చేసింది’ అంటూ విజయ్ క్యారెక్టర్‌ని రివీల్ చేయబోతున్నట్లు కన్‌ఫర్మ్ చేశారు. పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడం.. పూరి, చార్మిలతో పాటు కరణ్ జోహార్ కూడా నిర్మిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం విజయ్ పూర్తిగా మేకోవర్ కావడం కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచింది. అచ్చమైన బాక్సర్ లుక్లో తనని చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే మరి!