తెలుగు జాతికి భూషణాలు గ్రంథావిష్కరణ

తెలుగు జాతికి భూషణాలు గ్రంథావిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: తెలుగు జాతి గర్వించదగ్గ ప్రముఖుల జీవిత విశేషాలను భావితరాలకు పరిచయం చేసే గొప్ప గ్రంథం ‘తెలుగు జాతికి భూషణాలు’ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. గురువారం అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్​లో రేవూరు అనంత పద్మనాభరావు 80వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..  భారత రత్న, పద్మ అవార్డు గ్రహీతలైన తెలుగు ప్రముఖుల జీవిత విశేషాలతో రూపొందించిన ఈ గ్రంథం యువతకు, భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారులు డాక్టర్ కేవి. రమణచారి, మాజీ కేంద్ర హోమ్ సెక్రటరీ పద్మభూషణ్ కె. పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు.