డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ముందుకెళ్తున్న సుధీర్ బాబు నుంచి రాబోతున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సోమవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఓ మధ్యతరగతి వ్యక్తిగా స్కూటర్‌పై కూరగాయలు తీసుకొస్తూ, స్కూల్ పిల్లలను పలకరిస్తూ కనిపిస్తున్న సుధీర్ బాబు లుక్ ఆకట్టుకుంది.
టీజర్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇదొక ఫాదర్ అండ్ సన్ డ్రామా. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. సాయిచంద్, షాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు. దసరాకి సినిమా విడుదల కానుంది.