మర్డర్ మిస్టరీతో మా ఊరి పొలిమేర 2.. రిలీజ్​ డేట్​ ఫిక్స్​

మర్డర్ మిస్టరీతో మా ఊరి పొలిమేర 2.. రిలీజ్​ డేట్​ ఫిక్స్​

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఊరి పొలిమేర 2(Ma Oori Polimera 2). గౌరు గణబాబు సమర్పణలో గౌరి కృష్ణ నిర్మించారు. గెట‌‌ప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత‌‌, బాలాదిత్య, ర‌‌వి వ‌‌ర్మ, చిత్రం శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 2న సినిమాను విడుదల చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించారు.

విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో మర్డర్ మిస్టరీ, బ్లాక్ మ్యాజిక్ అంశాలతో దీన్ని తెరకెక్కించాం. ఫస్ట్ పార్ట్‌‌ కంటే ఎక్కువ ఇంటరెస్టింగ్‌‌గా ఉండబోతోంది’ అని దర్శకుడు చెప్పాడు. వ‌‌రుణ్ తేజ్ లాంచ్ చేసిన టీజ‌‌ర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వ‌‌చ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది.. అని నిర్మాత తెలిపారు.

మా ఊరి పొలిమేర-2  సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా విడుదల తేదీని వెల్లడించారు.అలాగే ఈ మూవీలో డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ద‌ర్శకుడు. స‌త్యం రాజేష్‌, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెందు మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో న‌టించారు.