కాళేశ్వరం అవినీతికి కేసీఆరే బాధ్యుడు: మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు

కాళేశ్వరం అవినీతికి కేసీఆరే బాధ్యుడు: మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు

ఖైరతాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి బాధ్యుడు మాజీ సీఎం కేసీఆర్​నే అని అతనిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కె.వీరారెడ్డి డిమాండ్​ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడారు.  మూడేళ్లుగా తమ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

 తప్పుడు లెక్కలు చూపించి​ బ్యాంక్​లు, ఆర్థిక సంస్థల నుంచి కేసీఆర్ అప్పులు తెచ్చాడన్నారు. ఆయా సంస్థలు ఎలాంటి వివరాలు చూడకుండా కేసీఆర్​ ఇచ్చిన ముడుపులతో నిధులిచ్చారని ఆరోపించారు. దీనిపై ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి సిట్​ఏర్పాటు చేయాలని, అంతకుముందు కేసీఆర్​ను అరెస్టు చేసి జైలులో పెట్టాలని వీరారెడ్డి కోరారు.   సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి.నాగరాజు, సెక్రటరీలు జి.క్రాంతి,మహేశ్​తదితరులు పాల్గొన్నారు.​