తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో ‘మా వందే’

తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో ‘మా వందే’

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌గా ‘మా వందే’ చిత్రం తెరకెక్కుతోంది. సీహెచ్ క్రాంతికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇక సోమవారం హీరో ఉన్ని ముకుందన్‌ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ప్రధాని మోదీ పాత్రను ఉన్ని ముకుందన్‌ సమర్థవంతంగా పోషిస్తున్నారని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో మోదీ జీవితంలోని రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లో తెరకెక్కిస్తున్నారు.