అమేజాన్ బాస్ భార్యకు జాక్ పాట్ : ఆస్తి ఎన్ని లక్షల కోట్లంటే..?

అమేజాన్ బాస్ భార్యకు జాక్ పాట్ : ఆస్తి ఎన్ని లక్షల కోట్లంటే..?

అమేజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు అయిన జెఫ్ బెజోస్ నుంచి విడాకులు తీసుకున్న ఆయన మాజీ భార్య మెకెంజీ… ఇపుడు అపర కోటీశ్వరురాలిగా రికార్డులకెక్కారు. ప్రపంచ కుబేరుల జాబితాను తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. ఈ లిస్టులో మెకెంజీ బెజోస్ 23వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే రిచెస్ట్ మనుషుల్లో ఆమెది 23వ స్థానం. అంతే కాదు… వరల్డ్ లో అత్యంత ధనికురాలైన నాలుగో మహిళగా ఆమె రికార్డులకెక్కింది.

కొద్దినెలల కింద జరిగిన విడాకుల ఒప్పందంతో… మెకెంజీ జాక్ పాట్ కొట్టేసింది. జెఫ్ బెజోస్ తో డివోర్స్ డీల్… ఆమెను ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక మహిళల్లో ఒకరిని చేసింది. తన 62 బిలియన్ డాలర్ల ఆస్తిలో సగాన్ని భార్యకు భరణంగా చెల్లించారు జెఫ్ బెజోస్. కోర్టు ఆదేశాలతో.. అమేజాన్ షేర్స్ లో నాలుగో వంతు వాటా కూడా ఆమెకు దక్కింది. ఐతే.. వీటిపై ఓటింగ్ కంట్రోల్ మాత్రం నిలుపుకున్నారు జెఫ్ బెజోస్. ఈ షేర్లతో కలిపి.. తాజాగా మెకెంజీ మొత్తం ఆస్తి.. 35 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.2లక్షల 40వేల కోట్లకు చేరిందన్నమాట.

ప్రపంచంలోని టాప్ 3 ధనిక మహిళలు

  1. లోరియల్ హెయిరెస్ ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మీయర్స్ 53.7 బిలియన్ డాలర్లు
  2. ఏలీస్ వాల్టన్ (వాల్ మార్ట్ ఫౌండర్ కూతురు) 44.2 బిలియన్ డాలర్లు
  3. జాక్వెలీన్ బాడ్జర్ మార్స్ (క్యాండీ ఎంపైర్ సహ యజమాని) 37 బిలియన్ డాలర్స్