AAY Title Announcement: మ్యాడ్ హీరో ఆయ్ అండి! గోదావరి యాసలో సినిమా షురూ

AAY Title Announcement: మ్యాడ్ హీరో ఆయ్ అండి! గోదావరి యాసలో సినిమా షురూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బావమరిది నార్నే నితిన్(Narne nithin) మ్యాడ్(Mad) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్(Kalyan shankar) తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించింది. ఈ సినిమాతో నార్నే నితిన్ ఎన్టీఆర్ బావమరిది కంటే..మ్యాడ్ సినిమాలో అశోక్ గా కనిపించి అందరికీ దగ్గరయ్యాడు. ప్రస్తుతం నార్నే నితిన్ తన నెక్స్ట్ మూవీని..గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 టు బ్యానర్ లో చేస్తున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ను చాలా ఫన్నీగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది GA2. అంతేకాకుండా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఫన్నీ మీమ్స్ ను జతచేసి టైటిల్ తో పాటు సినిమాపై క్యూరియాసిటీ కలిగేలా చేశారు.ఈ సినిమాను అంజి కంచిపల్లి తెరకెక్కిస్తున్నాడు.

అయితే ప్రొడ్యూసర్ బన్నీ వాసు..డైరెక్టర్ అంజికి కాల్ చేసి..సినిమా స్టార్ట్ చేసి చాన్నాళ్ళైంది..టైటిల్ చెప్పండి డైరెక్టర్ గారు..ఇంకెన్నాళ్లు హోల్డ్ లో పెడ్తారండీ? ఫ్యాన్స్ అడుగుతున్నారు అంటూ మాట్లాడాడు.

అపుడు డైరెక్టర్ అంజి సమాధానమిస్తూ..ఆయ్ అండీ అంటారు.దీంతో టైటిల్ చెప్పకుండా ఆయ్ అంటారేంటి అని ప్రొడ్యూసర్ బన్నీ వాసు అనగా..మళ్లీ అలాగే అనేస్తాడు అంజి. ఇక ఇలా కాదులేండీ అంటూ..హీరో హీరోయిన్ కి కూడా ఫోన్ కనెక్ట్ చేయగా.. అప్పుడు దర్శకుడు మళ్లీ అదే తరహా సమాధానం రిపీట్ చేస్తాడు. హీరో నితిన్ ఎంట్రీ ఇచ్చిన..సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక అందరూ కన్ఫ్యూజ్ అవ్వగా..హీరోయిన్ క్యూట్ గా చెప్పండీ సార్..అనడంతో'ఆయ్'(AAY) అనేదే అసలు టైటిల్ అని దర్శకుడు అంజి చెబుతాడు.

ఆయ్ అనే పదం గోదావరిలో బాగా పాపులర్ అయిన లోకల్ వర్డ్ అవ్వడంతో..సరదాగా డైరెక్టర్ అంటున్నారేమో అనుకున్న మేకర్స్ కి చాలా ఫ్యన్నీ సన్నివేశాన్ని క్రియేట్ చేశాడు అంజి.ఇక మన పల్లెటూర్లో ఎంతో సరదాగా ఉండే ఈ పదాన్ని టైటిల్ గా ఎంచుకోవడం చాలా బాగుంది అంటూ సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో నితిన్ కు జోడిగా సారిక నయన్ నటిస్తోంది.

అచ్చ తెలుగు ఫోక్ సింగర్..రామ్ మిరియాల ఆయ్ సినిమాకు తనదైన బాణీలు అందిస్తున్నాడు.ఈ సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకుని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. మరి ఈ సినిమాతో నార్నే నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.