
అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మ్యాడ్ (Mad). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్(Narne Nithin) హీరోగా ఎంట్రీ ఇవ్వగా సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin), శ్రీ గౌరీ ప్రియా(Srigouri priya), అనంతిక(Ananthika) ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.అంతేకాదు అదిరిపోయే కలెక్షన్స్ కూడా రాబట్టింది.
కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కాలేజ్ లైఫ్, అక్కడ ఉండే అల్లరి, హాస్టల్ డేస్ ను ఫన్నీ వేలో ప్రెజెంట్ చేసిన ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంతో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీంతో ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
Also Read: సలార్ ప్రభాస్ వాడిన బైక్ కావాలా..అయితే ఇలా గెలుచుకోండి
ఈ నేపథ్యంలో ఇవాళ (ఏప్రిల్ 19న) ఆ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ని సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘మ్యాడ్’తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘టిల్ స్క్వేర్’కి రచయితలలో ఒకరిగా పనిచేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు,ఆయన తన నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్గా రూపొందుతోన్న‘మ్యాడ్ స్క్వేర్’తో మరోమారు అలరించనున్నట్లు తెలిపారు.
ఇక ఈ ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సినిమా షూటింగ్ త్వరలో షురూ కానుంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ డోస్ ను మరింత పెంచనున్నారట.
ఈ సీక్వెల్ లో మాత్రం ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఉద్యోగాలు వేటలో పడడంతో ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.మరి ఈ సారి భారీ అంచనాలతో వస్తున్న మ్యాడ్ సీక్వెల్ ఆడియన్స్ ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘మ్యాడ్’ సినిమా కోసం పని చేసిన టెక్నీషయన్స్ ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం కూడా పని చేస్తున్నారు.
#MADSquare BEGINS!! ??
— Sithara Entertainments (@SitharaEnts) April 19, 2024
It's time to take the FUN to new heights, Here are some clicks from the pooja ceremony which was held on UGADI. ✨?
Thank you Starboy #Siddu & @anudeepfilm garu for gracing the ceremony. ❤️@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya… pic.twitter.com/uW4hYRDLFP