
చిన్న సినిమా గా విడుదలై అద్భుత విజయం సాధించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్(Mad). ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్స్, అక్కడ జరిగే సరదా సన్నివేశాల నేపథ్యంలో దర్శకుడు కళ్యాణ్ శంకర్(Kalyan shankar) తెరకెక్కించిన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు పెద్దఎత్తున లాభాలు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth shobhan), రామ్ నితిన్(Ram nithin) ప్రధాన పాత్రలో వచ్చింది ఈ సినిమా.. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మ్యాడ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ మొదటి వారంలో అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మ్యాడ్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.