గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ దందా చేస్తున్న ఐటీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళవారం ( జనవరి 27 ) నిర్వహించిన తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి రూ. లక్షా 30 వేలు విలువజేసే 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
గచ్చిబౌలిలోని కేశవ్ నగర్ లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న సాయి కిరణ్ ను అరెస్ట్ చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. అతని దగ్గర నుంచి దగ్గర నుంచి డ్రగ్స్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వృత్తి రీత్యా ఐటీ ఉద్యోగి అయిన సాయికిరణ్..ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సాయికిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
