
హైదరాబాద్: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. వేలకు వేలు జీతాలు వస్తోన్న అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిణి చిక్కారు. పని మీద వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ALSO READ | రేపు..బుధవారం(జూలై9) భారత్ బంద్.. ఎందుకు ఈ బంద్..స్కూల్స్, బ్యాంకులకు సెలవు ఉందా..?
వివరాల ప్రకారం.. మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్గా పని చేస్తోన్న సుధా ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 2025, జూలై 8న హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్లో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రైడ్స్ చేసి టాక్స్ ఆఫీసర్ సుధాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం గగన్ విహార్లో తనిఖీలు చేశారు. నిందితురాలు సుధాఃపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు. ఇటీవల ఏసీబీకి చిక్కుతున్న వారిలో ఎక్కువగా మహిళా ఆఫీసర్లు ఉండటం గమనార్హం.