ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గురువారం డ్రగ్స్ సప్లై చేస్తుండగా మాధాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37 లో స్టడీస్ ను పక్కకు పెట్టి ఈజీ మనీ కోసం డ్రగ్స్ పెడ్లర్లుగా మారారు. మాదకద్రవ్యాల అమ్మకాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి 30 Lsd బ్లాడ్స్ డ్రగ్స్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ : కోల్కతా ఘటనలో ఆర్‌జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై నార్కో పరీక్షలు..?
పట్టుబడిన డ్రగ్స్ రూ.70 వేలు ఉంటుంది. చెన్నైకి చెందిన చరణ్ తేజ్, తోటి విద్యార్థులు కౌశిక్ తూబోటి, సయ్యద్ సర్ఫరాజ్ లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులకు సప్లై చేస్తున్నారని కేసు నమోదు చేశారు.