ఐటి ఉద్యోగిని : వేధించిన వాడిపై తిరగబడ్డ గర్భిణి

ఐటి ఉద్యోగిని : వేధించిన వాడిపై తిరగబడ్డ గర్భిణి

నడిరోడ్డుపై వేధించిన ఓ ఆకతాయికి దేహశుద్ధి చేసింది ఓ మహిళ. మాదాపూర్ లో  నాలుగునెలల గర్భిణీ అయిన ఓ ఐటీ ఉద్యోగిని నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె వెనకాల వచ్చిన ఓ  వ్యక్తి  అసభ్యకరంగా ప్రవర్తించాడు .దీంతో వెంటనే ఆమె అతని చొక్క పట్టుకుని నిలదీసింది. దీంతో అతను  దాడికి యత్నించగా ఆ గర్భిణి ఎదురు దాడి చేసింది. గట్టిగా అరవడంతో దగ్గరలో ఉన్న వాళ్లు వచ్చి అతనికి దేహశుద్ది చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో మాదాపూర్  పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి వివరాల ప్రకారం. సికింద్రాబాద్ వారాసిగూడలో ఉంటున్న మహిళ మాదాపూర్ లోని ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. రోజులాగే రాత్రి 8 గంటలకు ఆఫీసు వచ్చింది. 9 గంటలకు ఆమె భర్త కంపెనీ దగ్గరకు రావడంతో ఇద్దరు కలిసి దగ్గరలో భోజనం చేశారు. తర్వాత ఆమె భర్త వెళ్లిపోగానే ఆమె ఒంటరిగా ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ ఆఫీసుకు వస్తుంది. ఇంతలోనే ఓ వ్యక్తి వచ్చి ఆమెపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అతడి కాలర్ పట్టుకోవడంతో  అతను దాడి చేశాడు. ఆ మహిళ అతడిపై ఎదురు దాడికి దిగి చితకబాదారు.  గట్టిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడిని పట్టుకున్నారు. బాధితురాలి 100 కు ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన  పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.