మాదాపూర్లో కార్డన్ సెర్చ్ .. బైక్లు, కార్లతో పాటు గ్యాస్ సిలిండర్లు, మందు బాటిళ్లు సీజ్

మాదాపూర్లో కార్డన్ సెర్చ్ .. బైక్లు, కార్లతో పాటు గ్యాస్ సిలిండర్లు, మందు బాటిళ్లు సీజ్

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​ సిద్ధిక్​నగర్​లో డీసీపీ డాక్టర్​  వినీత్​ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. తనిఖీల్లో నాలుగు బెల్టు షాపులను గుర్తించి రూ.1.20 లక్షల విలువైన 305 లిక్కర్​ బాటిళ్లను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఐదు ఇండ్లలో రూ.లక్ష విలువైన గుట్కా, పొగాకు సీజ్​ చేశారు. అక్రమంగా గ్యాస్​ రీఫిల్లింగ్​ చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని 21 పెద్ద, 20 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని 46 బైకులు, ఒక కారు, మూడు ఆటోలను సీజ్​ చేశారు.