
మరికొద్ది రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7(Bidd boss season 7) మొదలు కానున్న నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించారు నచ్చావులే హీరోయిన్ మాధవి లత. గత నెలరోజులుగా మాధవి లత బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు మాధవి లత.
'నా అభిమానులకు ఓ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. బిగ్‌బాస్ సీజన్ 7 కోసం టీమ్ నన్ను సంప్రదించింది వాస్తవమే. అది కూడా ఇప్పటికీ మూడుసార్లు నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. కానీ నేను ఆ ఆఫర్స్ ను సున్నితంగా తిరస్కరించాను. నాకు బిగ్‌బాస్‌కు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రమూ లేదు. కానీ నన్ను అప్ప్రోచ్ అయినందుకు బిగ్‌బాస్ టీమ్‌కు నా కృతజ్ఞతలు" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మాధవి లత.
అయితే.. ఈ పోస్ట్ చుసిన చాలా మంది మాధవి లతను బాగ్ బాస్ కు వెళ్లసిందిగా గా కోరుకుంటున్నారు. ఒకసారి ట్రై చేయొచ్చుగా తప్పేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. మాధవి లత నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. బాగ్ బాస్ కు నో చెప్పి మంచి పని చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.