
గాంధీలో కరోనాతో తన భర్త మధుసూధన్ చనిపోతే సమాచారం ఎందుకివ్వలేదంటూ ఆయన భార్య మాధవి ప్రశ్నించింది. చనిపోతే అధికారులు డెత్ సర్టిఫికెట్ ఎందుకివ్వలేదన్నారు. తన భర్త చనిపోయాడన్న విషయాన్న తనకు ఎవరూ చెప్పలేదన్నారు. మంత్రి ఈటెల చెప్పినవన్నీ అబద్ధాలన్నారు మాధవి. చనిపోయిండనడానికి ఆధారాలు చూపెట్టాలన్నారు. తన భర్తను ఇవ్వాలని సర్కార్ ను కోరారు.
మధుసూధన్ మృతిపై ఇవాళ (మే5) హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. తన భర్త ఆచూకి తెలపాలని మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో పిటిషన్ వేశారు. 4 విచారించిన హైకోర్టు మధుసూధన్ మృతిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 1న మధుసూదన్ చనిపోయాడని ప్రభుత్వం చెప్పింది. గతంలో కూడా మాధవి తన భర్త ఆచూకి కోసం కేటీఆర్ కు ట్వీట్ చేశారు.