టవర్ ఎక్కి ఎస్టీపీపీ కార్మికుడి నిరసన

టవర్ ఎక్కి ఎస్టీపీపీ కార్మికుడి నిరసన

జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేసే ఆర్.మధు  జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు. గత కొంత కాలంగా పవర్ మేక్ అనుబంధ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన పీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము విత్​డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా రాలేదు. దీనిపై సంబంధిత కంపెనీ సిబ్బందిని కలిసినప్పటికీ పరిష్కారం చూపలేదని అసహనం వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు.

విషయం తెలుసుకున్న అడిషనల్​ ఎస్​ఐ నాగరాజు అక్కడికి చేరుకొని మధును బుజ్జగించే ప్రయత్నం చేశారు. విషయం అడిగి తెలుసుకొని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. ఇదే సమస్యపై మధు మార్చ్ 16న సైతం జైపూర్ మండల కేంద్రంలోని టవర్ ఎక్కాడు.