బీఆర్ఎస్ ఆరిపోయే దీపం.. కేటీఆర్కు ముందుంది ముసళ్ళ పండుగ : మధు యాష్కీ గౌడ్

బీఆర్ఎస్ ఆరిపోయే దీపం.. కేటీఆర్కు ముందుంది ముసళ్ళ పండుగ :  మధు యాష్కీ గౌడ్

బీఆర్ఎస్ ఆరిపోయే దీపమని విమర్శించారు  కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ  గౌడ్.  కాంగ్రెస్ వంద రోజుల పాలన చూసి కేటీఆర్ బయపడిపోతున్నారని, ఆయనకుముందుంది ముసళ్ళ పండగ అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట అంటే ఎగిరెగిరి పడ్డ బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కేటీఆర్ బాషకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.  

భువనగిరి నుంచి తాను పోటీ చేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరినట్లుగా మధుయాష్కీ  గౌడ్ తెలిపారు.  తనను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని  రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారని... కానీ  తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పానన్నారు.  పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటదని చెప్పారు  మధుయాష్కీ  గౌడ్. రెడ్డి సీఎం, ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నారు.. బీసీ నేతకు పీసీసీ వస్తదని తెలిపారు.  లా అండ్ అండర్ సీఎం చేతిలో ఉంటుందని వెల్లడించారు. 

ఫోన్ ట్యాపింగ్ లో  ఎ1,ఎ2 గా  కేసీఆర్ ,కేటీఆర్ ఉంటారన్నారు మధుయాష్కీ గౌడ్. అధికారుల విచారణ అయిన తర్వాతే కేసీఆర్, కేటీఆర్ లను విచారించే అవకాశం ఉందన్నారు.  కవిత  లిక్కర్ స్కామ్ ఎంతసేపు ఫేక్ కేసు అంటుంది కానీ ,నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై పోరాటం చేస్తుందని చెప్పుకొచ్చారు.  అన్ని శాఖలలో బీఆర్ఎస్ అనుకూల అధికారులే ఉన్నారని ..   పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవినీతి అధికారుల పై విచారణ జరిగే అవకాశం ఉందని తెలిపారు.