
- మంత్రి సీతక్కకు పంచాయతీ సెక్రటరీల అసోసియేన్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ పంచా యతీ రాజ్ మంత్రి సీతక్కను కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం జేపీఎస్ లకు 2 ఏండ్ల ప్రొబేషన్ టైమ్ ఉంటే 4 ఏండ్లకు పెంచిందని, ఈ టైమ్ ను 2 ఏండ్లకు తగ్గించి, మిగతా 2 ఏండ్లను సర్వీస్‌గా పరిగణించాలని తెలిపారు.
317 జీవోతో స్థానికత కోల్పోయిన సెక్రటరీలకు న్యా యం చేయాలని చెప్పారు. సొంత జిల్లాకు సంబంధం లేకుండా దూరంగా ఉన్న ప్రాంతాలకు బదిలీ అయ్యారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ అయిన వారిని జేపీఎస్‌లుగా మార్చాలన్నారు.