రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి : మధుసూదనాచారి

రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి : మధుసూదనాచారి
  • కోడ్ ఉల్లంఘించారంటూ సీఎస్‌‌‌‌ఈకి మధుసూదనాచారి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ ప్రచారంలో సీఎం రేవంత్​ రెడ్డి ఎన్నికల కోడ్‌‌‌‌ ఉల్లంఘించి రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీస్కోవాలని చీఫ్‌‌‌‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ను శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్​ చేశారు. గురువారం ఆయన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ నేతలతో కలిసి సీఈవో సుదర్శన్​ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

జూబ్లీహిల్స్​లో ఓడిపోతే పదవి పోతుందన్న భయంతో.. బీఆర్​ఎస్​కు ఓటేస్తే పథకాలు పోతాయని బెదిరిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్​ఎస్​ మైనారిటీ లీడర్​ షకీల్​ ఇంటికెళ్లి కాంగ్రెస్​ కార్యకర్తలు బెదిరింపులకు దిగారన్నారు. స్థానిక పోలీసులు, డీసీపీలు, ఏసీపీలు, అక్కడుండే రమేశ్‌‌‌‌నాయక్‌‌‌‌ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి అధికారులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు.