ఫీజు రీయింబర్స్‌‌ మెంట్‌‌ చెల్లించండి : మధు సూదనా చారి

ఫీజు రీయింబర్స్‌‌ మెంట్‌‌ చెల్లించండి : మధు సూదనా చారి
  • మధుసూదనాచారి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్ సమయానికి రాక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గన్​పార్క్​వద్ద బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మధుసూదనాచారి మాట్లాడుతూ.. మొత్తం రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.