మీ ఇగో వల్లే.. మీకు అనారోగ్య సమస్యలు..

మీ ఇగో వల్లే.. మీకు అనారోగ్య సమస్యలు..

ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని త్రివేణి ఘాట్ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ ఆశ్రమంలో ఐదవ రోజు శ్రీమద్ భగవత్ జ్ఞాన యాగం కొనసాగుతోంది. తొమ్మిది రోజుల యాగంలో భాగంగా గుజరాత్ బ్రూమల్ సద్గురు ధామ్‌ పీఠాధీపతి  స్వామి విద్యానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు.  శ్రీమద్ భాగవత్ జ్ఞాన సారాంశాన్ని  స్వామి విద్యానంద సరస్వతి బోధించారు. భగవత్ కథ సారాంశం నాలుగు శ్లోకాలలో ఉందని విద్యానంద్ సరస్వతి అన్నారు. 

భగవంతుని సారాంశాన్ని వివరిస్తూ  సృష్టి ప్రారంభం, మధ్య , ముగింపులో భగవంతుని చేతన రూపం ఉందని చెప్పారు. విముక్తి కలిగినప్పుడే చైతన్య స్వరూపాన్ని తెలుసుకోగలరని..  ఏమీ ఆశించని భక్తి నిజమైన భక్తి స్వామి విద్యానంద సరస్వతి అన్నారు. వివక్ష వల్ల కుటుంబంలో శాంతికి విఘాతం కలుగుతుందని, పైశాచిక ప్రవృత్తికి దారి తీస్తుందని అన్నారు. అనేక దుష్ప్రభావాలకు కారణం అయిన అహాన్ని వదిలిపెట్టాలని విద్యానంద సరస్వతి అన్నారు.