మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి అనటానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటన నిదర్శనం.. మధ్యప్రదేశ్ లోని చత్తర్ పూర్ కి చెందిన ఓ మహిళ చేసిన ఘనకార్యాన్ని చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.. మంచి బిడ్డ కోసం మరదితో పారిపోయింది ఓ మహిళ. పైగా తన మరిదికి అట్రాక్ట్ అయ్యానంటూ భర్తకు చెప్పి మరీ.. వెళ్ళిపోవటం ఇక్కడ ట్విస్ట్. మరిదితో వెళ్లిపోయిన తర్వాత తనకు ఏదైనా హాని జరిగితే.. మీదే బాధ్యత అంటూ తన భర్త, అత్త, మామలకు బెదిరింపు మెసేజెస్ పంపింది మహిళ.
భార్య చేసిన నిర్వాకానికి షాక్ కి గురైన భర్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పదేళ్ల కిందట వివాహమైన తమకు పిల్లలు లేరని.. తాను అందంగా లేని కారణంగా తన భార్య సఖ్యతగా ఉండేది కాదని పేర్కొన్నాడు బాధితుడు. మరిదికి ఆకర్షితురాలైన భార్య తనతో పిల్లలు కనేందుకు కూడా నిరాకరించిందని తెలిపాడు బాధితుడు. తనకంటే అందంగా ఉన్న మరిది అయితేనే తనకు అందమైన పిల్లలను ఇస్తాడని తన భార్య తరచూ చెప్పేదని పేర్కొన్నాడు బాధితుడు.
Also Read :- నేను గెలిస్తే..మద్యనిషేదం ఎత్తేస్తా
ఆమె ఎవరితో వెళ్లినా తమకు అభ్యంతరం లేదని.. బెదిరింపు మెసేజ్ లు పంపటం ఆపేలా చేయాలని బాధితుడి కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడితో పాటు కుటుంబసభ్యుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.