21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మాదిగ జోడో యాత్ర : పిడమర్తి రవి

21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మాదిగ జోడో యాత్ర : పిడమర్తి రవి

ఖైరతాబాద్​,వెలుగు: బీజేపీకి వ్యతిరేకంగా ఈనెల 21 నుంచి తెలంగాణలో మాదిగ జోడో యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్​మాజీ చైర్మన్​పిడమర్తి రవి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రాష్ట్ర  మాదిగ సంఘాల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న రవి మాట్లాడుతూ ‘మాదిగల పంతం’ బీజేపీ అంతం పేరుతో  సిటీలోని అమీర్​పేట నుంచి యాత్ర ప్రారంభమై కరీంనగర్​లో ముగుస్తుందని చెప్పారు.

 ప్రధాని మోదీ వర్గీకరణను పక్కన పెట్టి రామ మందిరాన్ని ప్రారంభించారని విమర్శించారు.  మాదిగలు బీజేపీ వైపు వెళ్లకుండా తాము అందరిని సంఘటిత పరుస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం నేతలు నర్సింగరావు, యాదన్న, బాబూరావు, గోపాల్​, సుదర్శన్​పాల్గొన్నారు.