బెంగళూరు హర్రర్..19 ఏళ్ల అమ్మాయి అత్యాచారం కేసులో ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్, ఓ ఎలక్ట్రీషియన్

బెంగళూరు హర్రర్..19 ఏళ్ల అమ్మాయి అత్యాచారం కేసులో ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్, ఓ ఎలక్ట్రీషియన్

బెంగళూరులో సంచలనం సృష్టించిన 19ఏళ్ల అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ తోపాటు, ఓ ఎలక్ట్రిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడు, అతని స్నేహితుడితోపాటు సమీపంలో ఉండే ఎలక్ట్రిషన్ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడటంతో సన్నిహిత సమాజంపై సన్నగిల్లుతున్న నమ్మకంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

కర్ణాటకలోని మాగడికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ఇద్దరు కాలేజీ స్టూడెంట్లు, ఓ ఎలక్ట్రిషియన్ ను బుధవారం (డిసెంబర్ 17) కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె ప్రియుడు అని చెప్పబడుతున్న వికాస్ తోపాటు మరో ఇద్దరు ప్రశాంత్ , చేతన్ లను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కష్టడీకి తరలించారు. పోలీసుల విచారణ సంచలన విషయాలు బయటికొచ్చాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బాధితురాలిపై అత్యాచారం చేసి రహస్యంగా రికార్డ్ చేసి  వీడియోలను వాట్సాప్ లో షేర్ చేశారు. రేప్, గ్యాంగ్ రేప్, బ్లాక్ మెయిల్ ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు .

అసలేం జరిగిందంటే.. 

మాగడిలోని ఓ కాలేజీ పీజీ చదువుతున్న బాధితురాలిని ప్రేమపేరుతో నమ్మించాడు వికాస్ అనే యువకుడు.. ఏడు నెలలుగా సోషల్ మీడియాలో ఫాలో అవుతూ.. ఆమెను ప్రేమపేరుతో ట్రాప్ లోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారం చేశాడు. బాధితురాలితో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు.  వీడియోలను స్నేహితులైన 20ఏళ్ల బీకాం స్టూడెంట్ ప్రశాంత్, 26 ఏళ్ల ఎలక్ట్రిషియన్ చేతన్ లకు షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని బ్లాక్ చేసి ముగ్గురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

చేతన్ భార్య ప్రసవానికి వెళ్లిన సమయంలో బాధితురాలిని చేతన్ ఇంటికి రప్పించి పలుమార్లు అత్యాచారం  చేశారు. రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడయాలో షేర్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

ఈ కేసు ఓ యువతి వ్యక్తిగత క్షణాలను ఆయుధంగా చేసుకొని ఆమె హింసకు గురిచేసిన అమానవీయ కోణాన్ని హైలైట్ చేస్తుంది. ఇది వ్యక్తిగత బంధాలను మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న సమాజంపై విశ్వాసాన్ని కూడా సన్నగిల్లేలా చేస్తోందని పోలీసులు చెబుతున్నారు.