అండమాన్ సముద్రంలో 4.3 తీవ్రతతో భూకంపం

అండమాన్ సముద్రంలో 4.3 తీవ్రతతో భూకంపం

అండమాన్ సముద్రంలో 2023 అక్టోబర్ 08 ఆదివారం తెల్లవారుజామున భూకపం సంభవించింది.  సముద్రంలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.  NCS ప్రకారం అక్టోబర్ 8 తెల్లవారుజామున 03:20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.  అండమాన్ సముద్రంలో 10కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలతో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.  

మరోవైపు  ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన 5 వరుస భూకంపాలు ఆ దేశాన్ని తీవ్రంగా వణికించాయి.  భూకంపం  ధాటికి 320 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెరాత్ ప్రావిన్స్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మహ్మద్ తలేబ్ షాహిద్ చెప్పారు.   వరుస  భూకంపాలతో 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.