జమ్మూ కాశ్మీర్ లో భూకంపం

జమ్మూ కాశ్మీర్ లో భూకంపం

జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఉత్తర కశ్మీర్ లో  సోమవారం రాత్రి 9 గంటలకు భూకంపం సంభంవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS)  కార్గిల్,  శ్రీనగర్ ప్రదేశాల్లో మాగ్నటూడ్ భూ ప్రకంపనలు వచ్చాయి. రెక్టార్ స్కేల్ పై భూకంప త్రీవత 5.5గా నమోదు అయింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దీంతో చాలాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత తక్కువగా నమోదైంది. సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం ఈ సంవత్సరం జమ్మూ కశ్మీర్ లోయలో సంభవించిన రెండవ భూకంపం ఇది.

రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఈ భూకంపం కేంద్రం ఉత్తర కాశ్మీర్ అని అన్నారు. సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. జమ్మూతో పాటు లడఖ్‌లోని కార్గిల్‌లో కూడా భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.