ఇదేం పద్దతి: శ్రావణం మాసంలో బీఫ్ కట్లెట్ ఆర్డరా?: బీజేపీ నేత కొడుకు వ్యవహారంపై సంజయ్ రౌత్

ఇదేం పద్దతి: శ్రావణం మాసంలో బీఫ్ కట్లెట్ ఆర్డరా?: బీజేపీ నేత కొడుకు వ్యవహారంపై సంజయ్ రౌత్

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్ కులే కొడుకు బీఫ్ కట్ లెట్ ఆర్డర్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నాగ్ పూర్ లో చంద్రశేఖర్ బవాన్ కులే కొడుకు సంకేత్ కారు ప్రమాద ఘటనపై శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. సంకేత్ , అతని ఫ్రెండ్స్ భోజనం చేసిన హోటల్ బిల్లులో బీఫ్ కట్ టెల్ ఉందని అన్నారు.పవిత్రమైన శ్రావణ మాసంలో గణపతి పండుగ సందర్భంగా హిందూత్వం ప్రచారం చేసేవారు గోమాంసం తినడం ఆమోదయో గ్యమే నా అని ప్రశ్నించారు. 

మరోవైపు నాగపూర్ లో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు సంజయ్ రౌత్.. రోడ్డు భద్రత కంటే ఇది చాలా ముఖ్యమైనది.. ఓ సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రమాదం చేస్తే..  వారి కుటుంబ సభ్యులు, ప్నేహితులతో సహా పోలీస్ స్టేషన్ లో ఉండేవారని సంజయ్ రౌత్ అన్నారు. 
సంకేత్ బవాన్కులే పెద్ద బీజేపీ నేత కొడుకు కాబట్టే అతన్ని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెనకేసుకొస్తున్నాడని విమర్శించారు. హోంమంత్రిగా ఫడ్నవీస్ లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలమయ్యారని అన్నారు. ఇది ఒక చీకటి అధ్యాయం.. మహారాష్ట్ర చరిత్రలో ఇలాంటి హోంమంత్రి ఎప్పుడూ లేడని అన్నారు ఎంపీ సంజయ్ రౌత్.  

Also Read :- Cyber Crime 14C అంటే ఏంటీ..?