రిజర్వేషన్లపై ఊదరగొట్టి.. ఇప్పుడు కాదంటారా ? ఎంపీ ఆర్.కృష్ణయ్య

రిజర్వేషన్లపై ఊదరగొట్టి.. ఇప్పుడు కాదంటారా ? ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏడాది నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ఊదరగొట్టి, ఇప్పుడు కాదనడం ఏంటని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం కాకుండా, చట్టపరంగా 22 శాతం కల్పిస్తామని మంత్రివర్గ తీర్మానం చేసి బీసీలను మోసం చేశారని విమర్శించారు. 

గురువారం విద్యానగర్ బీసీ భవన్ లో సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ నేతృతంలో తెలంగాణ జాగ్రఫీ పోటీ పరీక్షల బుక్ లను ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా విద్యార్థులు, నిరుద్యోగులకు పంపిణీ చేశారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ జేఏసీ శుక్రవారం లకిడికపూల్ లోని అశోక హోటల్ లో 130 కుల సంఘాలు, బీసీ సంఘాలు, యువజన సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.