శివనామస్మరణతో మారుమోగిన బేగంబజార్ వీధులు

శివనామస్మరణతో మారుమోగిన బేగంబజార్ వీధులు

భం భం భోలె శంకర అంటూ శివనామస్మరణతో బేగంబజార్ వీధులు మారుమోగాయి. శ్రావణమాసం సందర్భంగా బేగంబజార్ కు చెందిన సంకట్ హరన్ మహాదేవ్ సంఘ్ సభ్యులు పరమేశ్వరుడి పల్లకి ఉరేగింపును భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పల్లకి ఊరేగింపులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గోశామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు పాల్గొని పల్లకి సేవ చేశారు.

30 రోజులపాటు శివుడికి విగ్రహానికి అభిషేకాలు చేస్తూ, రోజుకొక ప్రత్యేక అలంకరణతో ఉపవాసాలు ఉంటూ పూజించామని సంఘ్ సభ్యులు తెలిపారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఢమరుకం, శంఖలు వాయిస్తూ శోభయాత్రను నిర్వహించారు. బేగంబజార్ నరసింహస్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని భక్తి పారవశ్యంతో శివ కీర్తనలు ఆలపించారు.