మహబూబాబాద్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నివారణకు శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారంపై చర్చించారు. డ్రగ్స్ నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
జిల్లాలోని హాస్పిటల్స్, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలోల్లా ఎక్సైజ్ శాఖ అధికారి కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో పురుషోత్తం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సరిత, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, ఎక్సైజ్ సీఐ చిరంజీవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీను, కలెక్టరేట్ సూపరిండెంట్ రాజేశ్, డాక్టర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లో కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ కె.అనిల్ కుమార్, ఇతర ఉద్యోగులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
