నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్

తొర్రూరు, వెలుగు : ఉద్యోగులు విధి నిర్వాహణలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ కలెక్టర్​ స్నేహ శబరీశ్​ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల, పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. 

ప్రభుత్వం కల్పించే పక్కా డైట్ మెనూ ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతి విద్యా సంస్థ వసతి గృహాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. పీహెచ్​సీని సందర్శించి రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట తొర్రూరు ఆర్డీవో గణేశ్, సాంఘిక సంక్షేమ శాఖ డీసీవో జయశ్రీ తదితరులున్నారు.