మత్తులో జీవితాలు నాశనం చేసుకోవద్దు : మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్

మత్తులో జీవితాలు నాశనం చేసుకోవద్దు : మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకోవద్దని, సమాచారం అందించిన వారికి రూ.5 వేలు నగదు బహుమతిని పొందాలని మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్ అన్నారు. 

మంళవారం సిగ్నల్​కాలనీలోని ఎస్​పీతో పాటు టౌన్ సీఐ రఘుపతి రెడ్డి, పోలీస్ సిబ్బందితో కలిసి మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో పర్యటించి, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం అవగాహన పోస్టర్లను విడుదల చేసి, గోడలకు అతికించారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే 87126 56999 కు సమాచారం ఇవ్వాలని కోరారు.