జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించనున్నారు. పునరుద్ధరణలో భాగంగా కొనసాగుతున్న బోర్ హోల్స్ టెస్టుల పై ఇరిగేషన్ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష చేయనున్నారు. జిల్లా ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.
