ఏజెన్సీ ఏరియాలో నిఘా పెంచాలి : ఎస్పీ సంగ్రామ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌

ఏజెన్సీ ఏరియాలో నిఘా పెంచాలి : ఎస్పీ సంగ్రామ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌

మహబూబాబాద్/తొర్రూరు, వెలుగు : ఏజెన్సీ ఏరియాలో నిఘా మరింత పెంచాలని మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ సంగ్రామ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో శనివారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. అంతర్‌‌‌‌‌‌‌‌ జిల్లా బార్డర్స్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల్లో వాహనాల రాకపోకలపై నిఘా పెట్టాలన్నారు. ములుగు, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టుల నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట నిఘా, గస్తీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగదు, మద్యం, ఇతర మాదకద్రవ్యాలు రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సమావేశంలో ములుగు ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం, ఏఎస్పీ అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ సిరిశెట్టి, మహబూబాబాద్ ఏఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ డీఎస్పీ తీర్థాల సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం తొర్రూరు డీఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ను సరిగ్గా అమలు చేయాలని ఆదేశించారు. ఓటర్లలను ప్రలోభపెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర బాబు, సీఐ సత్యనారాయణ, ఎస్సై జగదీశ్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం చెప్పారు. రెండు అంతర్రాష్ట్ర, 5 అంతర్‌‌‌‌‌‌‌‌ జిల్లా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ములుగు జిల్లా ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎవరైనా ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ అతిక్రమించినా, ఫేక్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌ ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, లిక్కర్‌‌‌‌‌‌‌‌, ఇతర బహుమతులు తరలిస్తే సీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తామని, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పొలిటికల్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ప్రచారానికి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని, తప్పనిసరిగా రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించాలని సూచించారు.

నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా డీఎస్పీ రవీందర్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల  నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఓఎస్డీ అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పనిచేస్తారని ప్రకటించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,100 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశామని, 760 మంది రౌడీషీటర్లు, మాజీలను బైండోవర్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు చెప్పారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దని, తప్పని పరిస్థితిలో అంతకంటే ఎక్కువ తీసుకెళ్లే వారు ఆధారాలు చూపాలని చెప్పారు. సీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన డబ్బులను జిల్లా గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌ కమిటీకి అందజేస్తామని, వారం రోజుల్లో తగిన ఆధారాలు చూపించి తమ డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు. మూడు ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ టీంలతో తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.