కొమురవెల్లి, వెలుగు: వీరశైవ లింగాయత్ సమాజం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కొమురవెల్లికి చెందిన మహాదేవుని శ్రీనివాస్ ను ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీరశైవ లింగాయత్ సమాజం భవనంలో పట్టణ అధ్యక్షుడు నరుకుల శివప్ప, జిల్లా గౌరవ అధ్యక్షుడు భద్రప్పల ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఆకుల భద్రప్ప, వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షుడిగా మహదేవుని శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆకుల ప్రశాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజం అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు గౌరీ శంకర్, జిల్లా కమిటీ సభ్యుడు ఆంజనేయులు, ఉప్పెన శశిధర్, లుక్క శ్రీనివాస్, ఉప్పెన రాజశేఖర్, అనుముల మల్లేశం, షేర్ రాజ్ కుమార్, పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
