మహారాగ్ని మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

మహారాగ్ని మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మహారాగ్ని’. తెలుగు దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంయుక్త మీనన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  నసీరుద్దీన్ షా, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ప్రభుదేవా బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ వ్యక్తిని వెంటాడడంతో టీజర్ ప్రారంభమైంది.  ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంయుక్త మీనన్ కనిపించింది. అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేశారు. 

రెడ్ సూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాజోల్ ఎంట్రీ, జాతరలో ఆమె చేసిన ఫైట్ సీన్ ‘పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడిగి తీసుకోవడం కాదు.. పోరాడి పొందాలి’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి. మొత్తానికి యాక్షన్ ప్యాక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కట్ చేసిన టీజర్ ఇంప్రెస్ చేసింది.  ‘క్వీన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనేది ఈ మూవీ ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్.  వెంకట అనిష్ దొరిగిల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్. త్వరలోనే మరో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ ఇస్తామని చెప్పారు మేకర్స్.