మహారాష్ట్రలో ప్రమాదం: ఏడుగురి మృతి

మహారాష్ట్రలో ప్రమాదం: ఏడుగురి మృతి

వాద్రా: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాద్రా జిల్లాలోని సెల్సురా అనే ప్రాంతంలో సోమవారం రాత్రి 11.30కి ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి మీద నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వారిలో ఒకరు బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్ దలే కుమారుడు అవిష్కర్ అని ఎస్పీ ప్రశాంత్ హోల్కర్ తెలిపారు. మృతుల్లో కొందరు మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారని అని హోల్కర్ చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం..