
మహారాష్ట్రలో సెప్టెంబర్ 17వ తేదీ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చికల్‌దరా వద్ద ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరంతా నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలకు చెందినవారుగా అక్కడి పోలీసులు గర్తించారు. .
తెలంగాణ నుంచి కొందరు మిత్రులు విహార యాత్ర కోసం ఎర్టిగా కారులో మహారాష్ట్రకు వెళ్లారు. చికల్‌దరా వద్ద ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా..కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. కారు ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ..గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన కారులో ఆరుగురు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఇద్దరు వైభవ్, సల్మాన్ లు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టీ)కి చెందినవారు. వీరితో పాటు.. శివకృష్ణ, కొటేశ్వర్‌లు కూడా మృతి చెందారు. షేక్ సల్మాన్ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు సమాచారం. శ్యామ్ రెడ్డి, సుమన్, యశోద యాదవ్, హరీశ్‌లు తీవ్రంగా గాయపడ్డారు.