మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్న షిండే 

మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్న షిండే 

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మంగళవారం ఒక్కరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ అర్థరాత్రి ముంబై నుంచి బయల్దేరనున్నారు. ఆయన రేపు రాత్రి ఢిల్లీ నుంచి ముంబైకి తిరిగి వస్తారని సీఎంవో కార్యాలయం తెలిపింది. జూన్ 30 సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత షిండే రెండోసారి దేశ రాజధానికి వెళ్తున్నారు. ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు? అసలు ఎందుకు వెళ్తున్నారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ లు ఈనెల 8,9 తేదీల్లో ఢిల్లీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఇటీవల మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 20న విచారించనుంది. ఈ నేపథ్యంలో షిండే ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరిచుకుంది.