సినిమా షూటింగ్ లో ఎవరి మేకప్ వాళ్లే వేసుకోవాలి

సినిమా షూటింగ్ లో ఎవరి మేకప్ వాళ్లే వేసుకోవాలి

కరోనా వైరస్ కేసులు ముంబైలో ఎక్కువగానే నమోదవుతున్నాయి. అయినా మహారాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ సిని షూటింగులకు పర్మిషన్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం… నటీనటులు ఎవరి మేకప్ వాళ్లే వేసుకోవాలి. షూటింగ్ స్పాట్ లో కచ్చితంగా భౌతికదూరం పాటించాలి. సెట్స్ పై హత్తుకోవడాలు, ఫైట్లు, కిస్సింగ్ సీన్లకు అనుమతి లేదు.

అంతేకాదు పెళ్లి సీన్లు, మార్కెట్ సీన్లకు నో చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. షేక్ హాండ్, సిగరెట్లు షేర్ చేసుకోవడం ఇకపై వీలు కాదు. స్టూడియోలోకి కానీ, సెట్స్ పైకి కానీ రాగానే శానిటైజేషన్ తప్పనిసరి. ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక సెట్ పై 50 మంది కంటే ఎక్కువగా ఉండరాదు. ఈ మార్గదర్శకాలతో సినిమాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఫిలిం మేకింగ్ పూర్తిగా మారిపోతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.