వేడెక్కిన మహా రాజకీయం

వేడెక్కిన మహా రాజకీయం

మహారాష్ట్ర పాలిటిక్స్ గంట గంటకు మలుపుతిరుగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో మహా రాజకీయం రసవత్తరంగా మారింది.  రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే మకాంను అస్సాంకు మార్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో  మహారాష్ట్ర కాంగ్రెస్కు అబ్జర్వర్గా నియమితులైన కమలనాథ్..కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. శాసనసభ నేత బాలాసాహెబ్ థోరత్ నివాసంలోమొత్తం 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు..  సీనియర్ లీడర్లతో ఆయన మీటయ్యారు. ఈ సమావేశం అనంతరం కమల్ నాథ్..సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలవనున్నారు. 


మరోవైపు మహా సర్కారుపై ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు ఏగురవేసిన నేపథ్యంలో..సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ కేబినేట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం మంత్రులతో ఆయన సమావశేం కానున్నారు. ఏక్ నాథ్ షిండే వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  

అటు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎస్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు. ముంబైలోని పవార్ నివాసంలో ఆయన భేటీ అయ్యారు. 

ఇదిలా ఉంటే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకు కొవిడ్ బారిన పడ్డారు.  కొవిడ్ చికిత్స కోసం ఆయన HN రిలయన్స్ ఫౌండేషన్ లో అడ్మిట్ అయ్యారు.