ముంబైలో భవనం కూలిన ఘటనలో 19 మంది మృతి

ముంబైలో భవనం కూలిన ఘటనలో 19 మంది మృతి

ముంబైలోని  నాయక్ నగర్ లో  4 అంతస్తుల భవనం  కూలి 19 మంది  చనిపోయారు. సోమవారం  అర్ధరాత్రి జరిగిన  ఈ ప్రమాదంలో శిథిలాల  కింద సుమారు  40 మంది  చిక్కుకున్నారు. నిన్న మొత్తం రెస్క్యూ  ఆషరేషన్ కొనసాగింది.  మొత్తం 23 మందిని  రెస్క్యూ టీం సురక్షితంగా  రక్షించింది. అయితే  19 మంది శిథిలాల కింద చిక్కుకొని చనిపోయారు.  మరో 14 మందికి  గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి  ముందే  బిల్డింగ్ శిథిలావస్థలో  ఉందని ప్రభుత్వం తెలిపింది.  సిటీలో  4 బిల్డింగులకు  ఖాళీ చేయాలని నోటీసులిచ్చామన్నారు.  కొందరు ఖాళీ  చేయకుండా  బిల్డింగ్ లోనే ఉన్నారని  చెబుతోంది  రాష్ట్ర ప్రభుత్వం. నోటీసులు ఇస్తే  వెంటనే ఖాళీ చేయాలని  హెచ్చరించింది. మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం, గాయపడిన  వారికి  ఉచిత వైద్యం  అందిస్తామని మహారాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించింది.  ప్రమాదం  దురదృకరమన్నారు  ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు  కేంద్రం నుంచి 2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.