మహాత్మా జ్యోతిరావు పూలే 135 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఫూలే సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం (నవంబర్ 28)న జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు,వీహెచ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య ఇతర ముఖ్య నేతలు, అధికారులు హాజర్యారు.
ఈ సందర్భంగా విమలక్క , బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య పూలే సినిమా ఆడియో లాంచ్ చేశారు. అదే విధంగా ట్రైలర్ ను కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆవిష్కరించారు. పూలే ఆడియో సీడిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు విహెచ్, నిరంజన్, వెన్నెల, రాజయ్య, విమలక్క, పాశం యాదగిరి, జాజుల శ్రీనివాస్ ఆవిష్కరించారు.
సుపద క్రియేషన్స్ బ్యానర్ పై డా.పొన్నం రవిచంద్ర ఫూలే సినిమాను నిర్మించారు. సినిమాకు సంబంధించిన వివరాలు:
దర్శకత్వం: అనంత నారాయణ్ మహదేవన్
సహా నిర్మాత: సి.వి నవీన్ కుమార్
సంగీతం: ఎం.ఎం శ్రీ లేఖ
లిరిక్స్: పూర్ణాచారి,శ్రీదేవి తంగెళ్ల
మాటలు: చేతన్ కత్తి
నిర్మాణ పర్యవేక్షణ: చేతన్ కత్తి , గౌని తిరుపతి
