ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కన్నడ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ వరల్డ్‌వైడ్‌గా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మైథాలజీ సినిమా రూ.40 కోట్లతో రూపొందించగా, రూ. 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌లోనూ రికార్డు వ్యూస్‌తో సత్తా చాటింది.
ఇప్పుడు ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ దశకు అర్హత సాధించింది. పలు దేశాల నుంచి 35 యానిమేటెడ్ సినిమాలు పోటీ పడగా వాటిలో భారత్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ కావడం విశేషం.
దీంతో జనవరి 22న ప్రకటించనున్న ఫైనల్ నామిమేషన్స్ కోసం భారతీయ సినీ అభిమానులంతా ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు.
